Home  »  TV News  »  తాళి ఎవరు కట్టారని వసుధారని నిలదీసిన రిషి!

Updated : Feb 11, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -683 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. వసుధార మినిస్టర్ గారి దగ్గర.. "నా హస్బెండ్ ఆల్ రౌండర్" అని చెప్తుంది. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అదృష్టవంతుడెవరో చూడాలని ఉందమ్మా అని మినిస్టర్ అంటాడు. రిషి సర్ కూడా ఇలానే అన్నాడని వసుధార అనడంతో..  రిషికి కోపం వచ్చి ఏంటి ఇంత సరదాగా ఉత్సాహంగా మాట్లాడుతుంది. బాగా పొగరని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇద్దరు బయలుదేరుతారు.

జగతి, మహేంద్రలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేదో ఎవరు ఫోన్ చెయ్యట్లేదని రిషి, వసుధారల గురించి అనుకుంటారు. రిషి, వసుధారలు కార్ లో వెళ్తుండగా.. మినిస్టర్ గారు ఇచ్చిన చీరని తన మీద వేసుకొని సెల్ఫీలు తీసుకుంటుంది వసుధార. అది చూసిన రిషికి కోపమొస్తుంది. రిషి సర్ నవ్వండంటూ రిషితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తుంటుంది. "సర్ మీ మొహంపై నవ్వు మిస్ అయ్యింది" అని వసుధార  అనడంతో.. కార్ బ్రేక్ వేసి కార్ లో నుండి కోపంగా దిగుతాడు. "ఏంటి నువ్వు అస్సలు.. ఎందుకు వచ్చావ్ నా లైఫ్ లోకి.. నేను  ఐ లవ్ యు చెప్పాను నువ్వు నో చెప్పావ్.. మళ్ళీ కొన్ని రోజులకి నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావ్.. సరేనని ఒప్పుకున్నాను.  నువ్వు మీ ఊరు వెళ్ళి మారిపోయావ్.. నేను ప్రేమించినప్పుడు నో చెప్పి అలాగే ఉండిపోతే బాగుండేది.. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకొచ్చావ్? వాడెవడో వచ్చి నీ మెడలో తాళి కట్టానని అంటాడు. మళ్ళీ ఇంకెవడో వచ్చి తాళి కట్టలేదు అంటాడు.  అసలు నీ మెడలో తాళి కట్టింది ఎవడు?  నాకు ఇప్పుడు నిజం చెప్పు" అని రిషి ఆవేశంతో అనడంతో..  "సర్ నా మెడలో తాళి కట్టిన వ్యక్తి గురించి మర్యాదగా మాట్లాడండి" అంటూ వసుధార కోపంగా చెప్తుంది. "ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నా జీవితాన్ని నాశనం చేస్తున్నావ్.. ఇన్ని రంగులు ఎందుకు మార్చుతున్నావ్.. ఇదంతా నీ ప్లానా" అని రిషి అనడంతో.. ఒక్కసారి వసుధార గుండె ముక్కలవుతుంది. ఏంటి సర్.. ఏం మాట్లాడుతున్నారు. నేను రంగులు మార్చుతున్నానా? ఇదంతా నా ప్లానా అంటూ ఎమోషనల్ అవుతుంది. మీరు కూల్ గా అడిగితే నిజం చెప్పేదాన్నేమో కానీ నేను ఇప్పుడు చెప్పను. నా గురించి ఇన్ని తెలుసుకున్న మీరు.. నా మెడలో తాళి ఎవరు కట్టారో కూడా తెలుసుకోండని అక్కడ నుండి వెళ్లిపోతుంటుంది. అలా వెళ్లేముందు వెన్నక్కి తిరిగి.. "ఒక్క మాట సర్.. నా మెడలో తాళి కట్టింది ఎవడో అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు కదా.. ఆ విషయం నా మెడలో తాళి పడటానికి కారణం అయ్యిన వ్యక్తికి తెలిస్తే ఊరుకోడు" అని ఛాలెంజ్  విసిరి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వసుధార. తను వెళ్ళిపోయాక.. అనవసరంగా తొందరపడ్డానా అని రిషి అనుకుంటాడు.

జగతి, మహేంద్రలు ఆలోచిస్తూ రిషి, వసుధారలు ఊహకైనా అందరు.. ఇద్దరికి ఇగో టన్నుల్లో  ఉంటుందని మాట్లాడుకుంటారు. ఎవరు కూడా తగ్గరని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.